Suprerstar Krishna | కృష్ణ చివరిసారిగా ముప్పలనేని శివ దర్శకత్వంలో శ్రీశ్రీ (2016)చిత్రంలో టైటిల్ రోల్లో నటించారు. ఈ చిత్రంలో విజయ నిర్మల, నరేశ్, సాయికుమార్, మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రల్లో నటించారు. అంతకుముందు 2013లో ఆదిసాయికుమార్ హీరోగా నటించిన సుకుమారుడు చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఇదే సంవత్సరంలో శ్రీకాంత్, ఛార్మి కాంబినేషన్లో వచ్చిన సేవకుడు చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు.
ఒకే నటితో అత్యధిక సినిమాలు చేసిన హీరోగా అరుదైన రికార్డు కూడా కృష్ణ ఖాతాలో ఉంది. కృష్ణ తన సతీమణి, నిర్మాత, నటి విజయ నిర్మలతో 43 సినిమాలు (సుమారు), మరో నటి జయప్రదతో 43 సినిమాల్లో నటించారు. కృష్ణ, శ్రీదేవి కాంబినేషనల్లో 31 సినిమాలు వచ్చాయి. అలాగే సూపర్ స్టార్ కృష్ణతో 80 మంది హీరోయిన్లు నటించారు.