Aamir Khan | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హిట్ కాంబోలో ఒకటి అమీర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన త్రీ ఇడియట్స్, పీకే చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. కాగా ఈ ఇద్దరు మరోసారి భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌తో రాబోతున్నారని తెలిసిందే. బయోపిక్‌ను అనౌన్స్ కూడా చేశాడు డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ. అయితే ఇటీవల అమీర్ ఖాన్‌కు స్క్రిప్ట్ అంత ఇంప్రెసివ్‌గా అనిపించకపోవడంతో మరోసారి బయోపిక్ స్క్రిప్ట్ వర్క్ చేయాలని డైరెక్టర్‌కు సూచించినట్టు పుకార్లు ఊపందుకున్నాయి.
ఓ బాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ కథనం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టేనని అర్థమవుతోంది. అమీర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ ఏదైనా ఫర్ఫెక్షన్ కావాలనుకునేవారు. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ స్క్రిప్ట్ పట్ల వాళ్లు హ్యాపీగా లేరు. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచులకు తగినట్టుగా కాకుండా.. తమ కాంబోలో ఉండే కామిక్ టచ్ లేదని అమీర్ ఖాన్ భావిస్తు్న్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు పలుమార్లు రీరైటింగ్ సెషన్లు పెట్టుకున్న తర్వాత బయోపిక్‌ను ఆపేయాలని నిర్ణయించుకున్నారని.. అమీర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నారని తన కథనంలో రాసుకొచ్చింది.
అమీర్ ఖాన్ ఇప్పటికే లోకేశ్ కనగరాజ్‌తో చేయాల్సిన ప్రాజెక్ట్‌ను పక్కకు పెట్టేయగా.. తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చేయొద్దని ఫిక్సవడంతో అభిమానులు, మూవీ లవర్స్ షాకవుతున్నారు. మరి దీని గురించి అమీర్ ఖాన్ ఏదైనా ప్రకటన ఇస్తాడేమో చూడాలి.
Ram Gopal Varma | చాలా కాలం తర్వాత నిజమైన రాంచరణ్‌ను చూశా.. చికిరి చికిరి సాంగ్‌పై రాంగోపాల్ వర్మ