Aamir Khan | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan).. ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడిన విషయం తెలిసిందే. బెంగళూరు (Bengaluru)కు చెందిన గౌరీ స్ప్రాట్ (Gauri Spratt) అనే మహిళతో కొన్నాళ్లుగా డేటింగ్లో ఉన్నాడు. ఇటీవలే తన 60వ పుట్టినరోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన ఆమిర్.. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. తాజాగా మరోసారి వారి ప్రేమ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ మేరకు కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అసలు తాను ప్రేమలో పడాలనే ఆలోచనకు చాలా ఏళ్లు దూరంగా ఉన్నట్లు తెలిపారు.
‘గౌరీని కలవకముందు నేను థెరపీ చేయించుకున్నాను. దాని తర్వాత నన్ను నేను ప్రేమించుకోవడం ప్రారంభించాను. నా ఆరోగ్యంపై దృష్టిపెట్టాను. నా స్నేహితులు కూడా ప్రతి విషయంలోనూ మద్దతుగా నిలిచారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా నేను, గౌరీ స్ప్రాట్ అనుకోకుండా కలిశాం. ఆ తర్వాత స్నేహితులమయ్యాం. కొన్నేళ్ల తర్వాత మా మధ్య ప్రేమ పుట్టింది. ఇప్పుడు మా మధ్య నిజమైన ప్రేమ ఉంది. నాకు పిల్లలు, పేరెంట్స్, తోబుట్టువులు ఉన్నారు. వారితో రోజంతా గడుపుతాను. నాకు భాగస్వామి అవసరం లేదని భావించా. కిరణ్, రీనా, నేను పానీ ఫౌండేషన్ కోసం ఇప్పటికీ కలిసి పనిచేస్తున్నాం. ఇప్పుడు మేము భార్యాభర్తలు కాకపోవచ్చు. కానీ మేము ఎల్లప్పుడూ కుటుంబంగానే ఉంటాం. వారు ఎప్పటికీ నా జీవితంలో ఒక శాశ్వత భాగం’ అంటూ ఆమిర్ చెప్పుకొచ్చారు.
1986లో రీనా దత్తాను పెళ్లి చేసుకున్న ఆమిర్.. 2002లో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ మహిళా డైరెక్టర్ కిరణ్ రావుతో ప్రేమలో పడి.. 2005లో పెళ్లిపీటలెక్కాడు. ఈ జంట కూడా 2021లో విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గౌరీతో డేటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం తన ఆరేళ్ల కొడుకుతో కలిసి గౌరీ బెంగళూరులోనే ఉంటున్నది. ఈమె తల్లి కూడా సెలెబ్రిటీ స్టయిలిస్ట్. వీరికి బెంగళూరు, ముంబయి నగరాల్లో సెలూన్లు ఉన్నాయి. ఏడాదిన్నరగా డేటింగ్లో ఉన్న ఆమిర్ – గౌరీ బంధానికి ఇరు కుటుంబాలు ఓకే చెప్పాయట. దాంతో.. తమ బంధం గురించి బయటపెట్టాడు ఆమిర్. “గౌరీ, నేను పాతికేళ్లుగా స్నేహితులం. ఏడాది కాలంగా ఇద్దరం డేటింగ్లో ఉన్నాం!” అంటూ ఆమిర్ ఇటీవలే వెల్లడించాడు.
ఆమిర్ ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ‘హ్యాపీ పటేల్’, ‘చార్ దిన్ కీ చాందనీ’, ‘మహాభారతం’తో పాటు జోయా అక్తర్ సినిమాలో కూడా నటిస్తున్నారు. అయితే మహాభారతం మాత్రం ఆమిర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నారు. అయితే రాజమౌళి కూడా మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పినా… ఆయన ఆ వైపు అడుగులు వేయలేదు. అయితే జక్కన్న కన్నా ముందు ఆమీర్ ఖాన్ రంగంలో దిగడం చర్చనీయాంశంగా మారింది.
Also Read..
Dhanush | హేటర్స్కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ధనుష్.. మీరు ఎంత నెగెటివ్ అయిన చేసుకోండి…
Vidya Balan | హీరోయిన్లు అవకాశాలకు తగ్గట్లు మారాలి..! విద్యాబాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
Chiranjeevi | ఆలీకి మామిడిపండ్లతో పాటు సురేఖ వంటకాలని పంపిన చిరంజీవి