Dhanush | కోలీవుడ్ హీరో ధనుష్ ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేటస్ చేరుకున్నారు. కెరీర్లో ఎన్నో ఒడి దుడుకులూ ఆయన ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల కుబేర అనే చిత్రం తెరకెక్కించగా, ఇందులో నాగార్జున, రష్మిక కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని జూన్ 20న రిలీజ్ కానున్న నేపథ్యంలో చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధనుష్ మాట్లాడిన మాటలు, కొందరికి ఇచ్చిన కౌంటర్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అలానే శేఖర్ కమ్ముల ఇచ్చిన స్పీచ్, నాగార్జున మాటలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ వేడుకలో ధనుష్ తన రాబోయే సినిమాలపై వస్తోన్న నెగిటివ్ ప్రచారాన్ని గట్టిగానే ఖండించారు. కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తన రాబోయే సినిమాలల గురించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఎవరెన్ని చేసినా తనను ఏం చేయలేరని.. తన అభిమానులు తనపై వచ్చిన నెగిటివ్ ప్రచారాన్ని హ్యాండిల్ చేయగలరంటూ ధనుష్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తన సినిమా విడుదలకు నెల రోజులు ఉండగానే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని, అయిన ఏం చేయలేరని ధనుష్ అన్నారు. మీరు నాపై ఎంత నెగెటివ్ ప్రచారం చేసిన నా సినిమా విడుదల ఆపలేరు.
నా అభిమానులు నాతోనే ఉంటున్నారు. నా గురించి నెగిటివ్ ప్రచారాన్ని చేసేవారు దయచేసి పక్కకు వెళ్లి ఆడుకోండి.మాకు ఇలాంటి సర్కస్ లు వద్దు. ఇక్కడ నా అభిమానులు మాత్రమే కాదు.. నా సహచరులు కూడా ఉన్నారు. వారందరు కూడా 23 ఏళ్లుగా నాతోనే ఉన్నారు. నా గురించి నెగిటివ్ రూమర్స్ ప్రచారం చేసి నన్ను అడ్డుకుంటామని మీరు అనుకుంటే దానికి మించిన మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. గతంలో నేను చాలా ఇబ్బందులు పడి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. ఈ సినిమా తప్పక సూపర్ హిట్ అవుతుందని ధనుష్ అన్నారు. కుబేర చిత్రంపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. భారీ అంచనాల మధ్య రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.