అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ హీరోగా బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ మేకర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక పానిండియా సినిమా తెరకెక్కనున్నది. ఈ సినిమా అభిమానులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించనున్నదని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో మేకర్స్ పేర్కొన్నారు.
‘AA23’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాను బి.వి.ఆర్ట్స్‌తో కలిసి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ నిర్మించనున్నది. నవీన్ యర్నేని, వై.రవిశంకర్, బన్నీవాసు ఈ చిత్రానికి నిర్మాతలు కాగా, నట్టి, శాండీ, స్వాతి సహ నిర్మాతలు. అనిరుథ్ సంగీతం అందిస్తారు. ఈ ఏడాది ఆగస్ట్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నదని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా కథపై ఇప్పటికే ఫిల్మ్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.