Atlee | వరుణ్ ధవన్ హీరోగా నటిస్తోన్న చిత్రం బేబిజాన్. క్రిస్మస్ కానుకగా 2025 డిసెంబర్ 25న గ్రాండ్‌గా విడుదల కానుంది. స్టార్ డైరెక్టర్ అట్లీ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది వరుణ్ ధవన్ అండ్ అట్లీ (Atlee) టీం. కాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నెక్ట్స్ అట్లీ డైరెక్షన్లో ఇప్పటికే ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలిసిందే. A6 (వర్కింగ్ టైటిల్)గా వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రమోషన్స్‌లో ఈ సినిమా గురించి అట్లీ చెప్పిన మాటలు సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
A6 ప్రాజెక్ట్‌కు చాలా సమయం, శక్తి అవసరం. స్క్రిప్ట్ దాదాపు పూర్తి చేశాం. మేమిప్పుడు ప్రిపరేషన్ దశలో ఉన్నాం. దేవుడి ఆశీర్వాదంతో అతి త్వరలో అప్డేట్ మీ ముందుకు రాబోతుంది. నటీనటుల కోసం వేచి ఉండండి. ప్రతీ ఒక్కరినీ సర్ప్రైజ్ చేయబోతున్నా. నేను ఆడంబరంగా ఈ విషయం చెప్పడం లేదు.. కానీ ఏ6 దేశం గర్వించేలా చేస్తుందని భావిస్తున్నా. ఇందుకు మీ అందరి ఆశీస్సులు కావాలన్నాడు అట్లీ. ఇప్పుడీ కామెంట్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనుండగా.. పాపులర్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. ప్రస్తుతం సల్లూభాయ్ ఏఆర్ మురుగదాస్‌తో సికిందర్ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. కన్నడ భామ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
Vijay Sethupathi | టాలీవుడ్ డెబ్యూకు విజయ్ సేతుపతి రెడీ.. ఇంతకీ డైరెక్టర్ ఎవరో మరి..?