e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, November 30, 2021
Home News జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం జరిగిందా?

జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం జరిగిందా?

నేషనల్ అవార్డు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత అందరూ చేసే ప్రధాన అభియోగం.. మా సినిమాకు అవార్డు రాలేదు.. కావాలని మా సినిమాని పక్కన పెట్టారు అని. ఈసారి కూడా అలాంటి మాటలు వినిపిస్తున్నాయి. 67వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల ప్రధానోత్సవం త్వరలోనే జరగనుంది. అయితే ఇప్పటికే ఎవరెవరు అవార్డులు గెలుచుకున్నారనే విషయంపై ఒక క్లారిటీ వచ్చింది. జాతీయ ఉత్తమ నటుడు ధనుష్, మనోజ్ బాజ్‌పేయి విషయంలో ఎవరికీ పెద్దగా అభ్యంతరాలు లేవు. కానీ ఉత్తమ నటి విషయంలో మాత్రం చాలా మంది అభ్యంతరాలు తెలుపుతున్నారు. మరోసారి కంగనా రనౌత్‌కు ఉత్తమ నటి అవార్డు రావడంపై కొందరు ప్రశంసలు కురిపిస్తున్నా.. మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు.

మోదీ హయాంలోనే మూడుసార్లు ఆమెకు నేషనల్ అవార్డు వచ్చిందని.. కావాలనే ఆమెకు పెద్ద పీట వేస్తున్నారు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -

మరోవైపు కంగనా అద్భుతమైన నటి.. ఆమె ప్రత్యేకంగా ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.. అందుకే అవార్డులు నడుచుకుంటూ వస్తున్నాయి అంటూ సపోర్ట్ చేస్తున్నారు.

మణికర్ణిక, పంగా సినిమాలలో నటనకు గానూ ఈమెకు నేషనల్ అవార్డు వచ్చింది.
ఇదంతా ఇలా ఉంటే తెలుగు సినిమాలకు 5 అవార్డులు రావడం గర్వకారణం అంటూనే.. మరికొన్ని సినిమాలకు అన్యాయం జరిగింది అంటూ సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు తెరలేపారు నెటిజన్లు.

ముఖ్యంగా 2019లో విడుదలైన చిరంజీవి సైరా సినిమాను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు.

అందులో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌కు తోడు అత్యద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్లు కూడా ఉన్నాయని.. అవి మీ కంటికి కనిపించ‌లేదా అని మెగా ఫ్యాన్స్ నిలదీస్తున్నారు.

ఇంకా విడుదల కాని మోహన్ లాల్ మలయాళ సినిమా మరక్కార్‌లో మీకు అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కనిపించాయి.

మరి సైరాలో ఎందుకు కనిపించలేదు అని వారు ప్రశ్నిస్తున్నారు. కేరళలో త్వరలోనే ఎన్నికలు రానున్నాయి కాబట్టి మోహన్ లాల్ సినిమాకు పెద్ద పీట వేశారని విమర్శలు వస్తున్నాయి.

కచ్చితంగా సైరాకు కనీసం ఒక జాతీయ అవార్డు అయినా రావాల్సింది అని మెగా అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఏదేమైనా కూడా కొన్ని అవార్డులు ఏకపక్షంగా ఇచ్చారనే విమర్శలు మాత్రం తప్పడం లేదు.

ఇవి కూడా చ‌ద‌వండి..

జాతీయ ఉత్త‌మ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’

ఉత్త‌మ న‌టి కంగ‌నా.. ఉత్త‌మ హిందీ చిత్రం చిచోరే

కంగ‌నా రనౌత్ @ నేషనల్ అవార్డ్ నెం 4.. ఈ తరం మహానటి…

‘మహర్షి’ సినిమాకి 3 జాతీయ అవార్డులు.. కాలర్ ఎగరేస్తున్న మహేష్ ఫ్యాన్స్

జాతీయ అవార్డులు గెలుచుకుంది వీళ్లే

ఆ సోకులు చూసి చిన్నదాన నీకోసం అంటారేమో మిస్తీ

జాతి ర‌త్నాలు మేకింగ్ వీడియో

మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత

పవన్ సినిమా హిట్ అయితేనే బన్నీ అతడికి ఛాన్స్ ఇస్తాడా?

త‌లైవి ట్రైల‌ర్ విడుద‌ల‌..

నేను సున్నిత‌మైన వ్య‌క్తిని: అదితీరావు హైద‌రి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement