హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన జల్జీవన్ మిషన్ నిధులను మూడేండ్లుగా తెలంగాణ సర్కార్ నిర్దేశిత స్థాయిలో వినియోగించడం లేదని కేంద్రజల్శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు.
పార్లమెంట్లో అందుకు సంబంధించిన వివరాలను సోమవారం వివరించారు. జల్జీవన్ మిషన్ ద్వారా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.873కోట్ల నిధులు మంజూరు చేసిందని వివరించారు. మూడేండ్లుగా ఆ నిధుల్లో తెలంగాణ సర్కార్ కేవలం రూ.194కోట్లు మాత్రమే వినియోగించుకున్నదని తెలిపారు. నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదని కేంద్రజల్శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు.