యాంకర్ ప్రదీప్ హీరోగా మున్నా అనే దర్శకుడు తెరకెక్కించిన చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. కరోనా వలన గత ఏడాది ఈ చిత్రం విడుదల కొద్దిగా ఆలస్యమైన ఎట్టకేలకు థియేటర్లో వచ్చి ప్రేక్షకులని అలరించింది. ఇందులో కథానాయికగా అమృత అయ్యర్ నటించింది. మున్నా అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించగా, తాజాగా ఆయన ఈ సినిమా షూటింగ్‌కు ముందు జరిగిన కొన్ని విషయాలు వివరించాడు.
30 రోజుల్లో ప్రేమించడం ఎలా? కథ రాసుకున్నాక నటీనటుల వేట మొదలు పెట్టిన మున్నా ముందుగా సమంత మేనేజర్‌కు కథ వివరించగా, ఆయన ఇంప్రెస్ కావడంతో సమంత దగ్గరకు తీసుకెళ్లాడట. సమంత కథ విని చాలా బాగుందని, కాకపోతే డేట్స్ అడ్జెస్ట్ చేయడం కష్టమని అనడంతో తర్వాతి ఆప్షన్‌గా అమృత నాయర్‌ని ఎంపిక చేసుకున్నానని మున్నా పేర్కొన్నాడు. సమంతను హీరోయిన్గా అనుకున్నపుడు ఇంకా హీరోగా యాంకర్ ప్రదీప్‌ని ఫైనల్ చేయలేదని ఆయన చెప్పారు. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సినిమా పర్వాలేదనిపించింది. ఇందులో ”నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా” సాంగ్ ఫుల్ పాపులర్ అయింది.