టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. కొత్త కథలను ఎంపిక చేసుకుంటూ ఆడియన్స్ను థ్రిల్ చేస్తున్నాడు. తాజాగా నిఖిల్ పలు చిత్రాలు చేస్తుండగా, వాటిలో “18 పేజెస్” కూడా ఒకటి. ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రాన్ని పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, తాజాగా అప్డేట్ ఇచ్చారు.
ప్రీ లుక్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేసి దాని ద్వారా ఫస్ట్ లుక్ పోస్టర్ అనౌన్సమెంట్ ఇచ్చారు. ఒక పక్క చేతిలో ఫోన్ పట్టుకొని బ్యాక్గ్రౌండ్ లో టెక్నాలజీని చూపిస్తూ మరో పక్క చేతిలో పెన్ పట్టుకొని జూన్ 1న ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానుందని తెలియజేస్తున్నట్టుగా ఉంది. చాలా క్రియేటివిటీగా పోస్టర్ డిజైన్ చేయగా, ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంకెంత క్రియేటివిటీగా ఉంటుందని ఫ్యాన్స్ ఆలోచనలు చేస్తున్నారు. బన్నీ వాస్ నిర్మాణం వహిస్తున్నఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.