‘యాస్ ఎఫెక్ట్’.. కోల్‌కతా ఎయిర్‌పోర్టు మూసివేత
‘యాస్ ఎఫెక్ట్’.. కోల్‌కతా ఎయిర్‌పోర్టు | యాస్ తుఫాను నేపథ్యంలో కోల్‌కతా ఎయిర్‌పోర్టును అధికారులు మూసివేశారు. బుధవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 7.45 గంటల వరకు విమానాల రాకపోకలను రద్దు చేసినట్లు విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు.

కోల్‌కతా : యాస్ తుఫాను నేపథ్యంలో కోల్‌కతా ఎయిర్‌పోర్టును అధికారులు మూసివేశారు. బుధవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 7.45 గంటల వరకు విమానాల రాకపోకలను రద్దు చేసినట్లు విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. తుఫాను ప్రభావంతో విమాన సర్వీసుల రాకపోకలను రద్దు చేసినందున ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని కోల్‌కతా విమానాశ్రయ అధికారులు ట్వీట్ చేశారు. విమాన సర్వీసులను రద్దు చేసినందున టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు రీఫండ్ చేస్తామని ఇండిగో ట్వీట్ చేసింది. తుఫాను నేపథ్యంలో ఇప్పటికే పశ్చిమ బెంగాల్, ఒడిశాతో పాటు పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అతి తీవ్ర తుఫానుగా మారిందని, ఈ రోజు మధ్యాహ్నం వరకు బాలాసోర్ ధమ్రా నౌకాశ్రయానికి ఉత్తరాన తీరం దాటుతుందని, ఈ సమయంలో గంటకు 130-155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
ఆగని పెట్రోల్, డీజిల్ ధరల మోత
కరోనాను జయించిన 72 ఏండ్ల వృద్ధురాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

