దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 4వేలకుపైగా మరణాలు
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 4వేలకుపైగా మరణాలు | శంలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. వరుసగా రెండో రోజు మూడు లక్షలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. మరోసారి మూడు లక్షలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, మరణాలు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి. వరుసగా రెండో రోజు నాలుగువేలకుపైగా మరణాలు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,08,921 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. కొత్తగా 2,95,955 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకోగా.. 4,157 మంది మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,71,57,795కు పెరిగాయని, ఇప్పటి వరకు 2,43,50,816 మంది కోలుకున్నారు.
వైరస్ బారినపడి మొత్తం 3,11,388 మంది కన్నుమూశారు. ప్రస్తుతం దేశంలో 24,95,591 యాక్టివ్ కేసులున్నాయి. మరో వైపు టీకా డ్రైవ్‌లో భారత్ మరో మైలురాయిని దాటింది. ఇప్పటి వరకు 20,06,62,456 కోట్ల డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. దేశంలో రికవరీ రేటు పెరుగుతోంది, ప్రస్తుతం 89.66శాతంగా ఉందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా.. నిన్న ఒకే రోజు రికార్డు స్థాయిలో 22,17,320 కొవిడ్ టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటి వరకు 33,48,11,496 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.
ఇవి కూడా చదవండి..
ఆగని పెట్రోల్, డీజిల్ ధరల మోత
కరోనాను జయించిన 72 ఏండ్ల వృద్ధురాలు
‘యాస్ ఎఫెక్ట్’.. కోల్‌కతా ఎయిర్‌పోర్టు మూసివేత
కరోనాకు 513 మంది వైద్యుల బలి
మరికొద్ది గంటల్లో తీరం దాటనున్న ‘యాస్’
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

