Varun Dhawan | బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్, సమంత (Samantha) లీడ్ రోల్స్‌లో వస్తోన్న వెబ్ సిరీస్ సిటడెల్ (Citadel: Honey Bunny). సిటడెల్ ఇండియన్ వెర్షన్‌గా వస్తున్న ఈ వెబ్ ప్రాజెక్ట్ నవంబర్ 7న పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైం వీడియోలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా ప్రీమియర్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను కూడా లాంచ్ చేశారు.
ట్రైలర్ ఫన్నీ ట్రాక్, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అద్భుతమైన విజువల్స్‌తో సాగుతూ క్యూరియాసిటీ పెంచేస్తుంది. కాగా ట్రైలర్ లాంచ్ సందర్భంగా వరుణ్ ధవన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్పెషల్ సీన్ కోసం సమంత, తాను విశ్రాంతి లేకుండా షూట్లో పాల్గొన్న విషయాన్ని షేర్ చేశాడు.
11 నిమిషాలపాటు ఓ సన్నివేశాన్ని సింగిల్ టేక్‌లో ఎలాంటి కట్స్ లేకుండా చిత్రీకరించామన్నాడు వరుణ్ ధవన్. ఈ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ సిరీస్‌లో క్లైమాక్స్ టైంలో వస్తుందన్నాడు. వరుణ్ ధవన్ తాజా అప్డేట్తో సిటడెల్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
రాజ్-డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో కేకే మీనన్, సిమ్రన్, సోహం మజుందార్, శివంకిత్ పరిహార్, కశ్వీ మజుందార్, సాఖిబ్ సలీం, సికిందర్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిటడెల్ను రాజ్& డీకే D2R Films బ్యానర్‌పై నిర్మి్స్తుండగా.. రాజ్&డీకే, సీతా మీనన్ కథనందించారు.
Naga Chaitanya | అప్పటి నుంచే రేసు కారు జోలికిపోవడం లేదు : నాగచైతన్య
Thandel | రాంచరణ్ వర్సెస్ నాగచైతన్య.. తండేల్ రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసినట్టేనా..?
Veera Dheera Sooran | ఐ ఫోన్లో తీసిన పోస్టర్ అట.. విక్రమ్ వీరధీరసూరన్ లుక్ వైరల్