Twitter – X | సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ (Twitter) పిట్ట ఎగిరిపోయింది. ఆ స్థానంలోకి కొత్త లోగో ‘ఎక్స్’ (X) వచ్చేసింది. ఈ మేరకు సంస్థ హెడ్ క్వార్టర్స్ (Twitter Headquarters) పై కొత్త లోగో (New Logo)ని ప్రదర్శించిన ఫొటోను ఎలాన్ మస్క్ పోస్టు చేశారు. దాంతోపాటు మస్క్ తన ట్విట్టర్ ప్రొఫైల్ డిస్ ప్లేని కూడా ‘ఎక్స్’గా మార్చేశారు.
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ను గతేడాది మస్క్ టేకోవర్ చేసిన విషయం తెలిసిందే. సైట్ ను తన చేతుల్లోకి తీసుకోగానే మస్క్.. పలు మార్పులు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ట్విట్టర్ ‘బర్డ్’ లోగో స్థానంలో ‘ఎక్స్’ లోగో తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. దాంతో పాటు ఇక ట్విట్టర్ పేరు కూడా ఎక్స్ గా మార్చేశారు. ఇకపై ట్విట్టర్ డాట్ కామ్ బదులు ఎక్స్.కామ్ లైవ్ లోకి వస్తుందని మస్క్ ట్విట్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే.
Our headquarters tonight pic.twitter.com/GO6yY8R7fO
— Elon Musk (@elonmusk) July 24, 2023
Also Read..
IndiGo | యుద్ధ వీరుడికి ఇండిగో అపూర్వ సత్కారం.. వీడియో వైరల్
Sudha Murty | స్టార్ నటి కారణంగా ఏడ్చేసిన సుధామూర్తి..!
Samantha | వెకేషన్లో సామ్.. కొత్త లుక్‌లో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తూ..