IndiGo | యుద్ధ వీరుడికి ఇండిగో అపూర్వ సత్కారం.. వీడియో వైరల్
IndiGo | కార్గిల్ యుద్ధం (Kargil War)లో దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి శత్రుమూకలను హతమార్చిన వీరుడిని ఇండిగో (IndiGo) తాజాగా సత్కరించింది.
IndiGo | కార్గిల్ యుద్ధం (Kargil War)లో దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి శత్రుమూకలను హతమార్చిన వీరుడిని ఇండిగో (IndiGo) తాజాగా సత్కరించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
‘పరమ్ వీర్ చక్ర’ (Param Vir Chakra) అవార్డు గ్రహీత సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్ (Subedar Major Sanjay Kumar) ఆదివారం పుణె (Pune) వెళ్లే ఇండిగో విమానంలో ప్రయాణించారు. ఈ సందర్భంగా విమానం టేకాఫ్ కు ముందు ఆయనకు అనుకోకుండా గొప్ప గౌరవం లభించింది. సంజయ్ కుమార్ ను గౌరవిస్తూ కెప్టెన్ ప్రత్యేక అనౌన్స్ మెంట్ చేశారు. సంజయ్ కుమార్ దేశానికి అందించిన సేవలను వివరించారు.
‘ఈ రోజు మనతో పాలు ఓ ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు. ఆయనే ‘పరమ్ వీర్ చక్ర’ బహుమతి గ్రహీత సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్. యుద్ధ వీరుల ధైర్యసాహసాలకు ఇచ్చే అత్యున్నత గ్యాలెంట్రీ అవార్డు ఇది. భారత చరిత్రలో ఇప్పటి వరకు కేవలం 21 మంది మాత్రమే ఈ గౌరవాన్ని అందుకున్నారు. 1999 జులై 4న జమ్మూకశ్మీర్ రైఫిల్స్ 13వ బెటాలియన్ సభ్యుడిగా ఉన్న సంజయ్.. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలకు తెగించి పోరాడారు. ఆ యుద్ధంలో శత్రువుల దాడిలో సంజయ్ ఛాతీపై రెండు బుల్లెట్లు, చేతిపై ఒక బుల్లెట్ దూసుకెళ్లాయి. అయినా, ఆయన వెనకడుగు వేయకుండా శత్రువుల బంకర్లోనికి వెళ్లి మరీ పాక్ సైనికులను హతమార్చారు’ అంటూ నాటి సంగతులను వివరించారు. ఈ అనౌన్స్ మెంట్ తో విమానంలోని ప్రయాణికులు అంతా చప్పట్లతో ఆయనను గౌరవించారు. ఇండిగో క్రూ సిబ్బంది కూడా ఆయనకు చిరు కానుకలను అందించిన ఘనంగా సత్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండిగో తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. దీనికి హీరోతో కలిసి విమాన ప్రయాణం అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Flying with a hero: Subedar Major Sanjay Kumar ji, a Living Param Veer Chakra awardee! #goIndiGo #IndiaByIndiGo pic.twitter.com/CZsqlHxRj6
— IndiGo (@IndiGo6E) July 23, 2023
Also Read..
Sudha Murty | స్టార్ నటి కారణంగా ఏడ్చేసిన సుధామూర్తి..!
Samantha | వెకేషన్లో సామ్.. కొత్త లుక్‌లో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తూ..
Indian Student | కెనడాలో భారతీయ విద్యార్థిపై దాడి.. చికిత్స పొందుతూ మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

