Samantha | వెకేషన్లో సామ్.. కొత్త లుక్‌లో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తూ..
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha).. ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సామ్ తన కొత్త లుక్ ను అభిమానులకు పరిచయం చేసింది. తన హెయిర్ (Hair)ను పూర్తిగా కట్ చేసి.. షార్ట్ హెయిర్ తో క్యూట్ లుక్ తో అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది.
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha).. ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను సైతం పూర్తి చేసింది. విజయ్ దేవరకొండతో ఖుషి (Kushi), బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తో కలిసి ‘సిటాడెల్’ (Citadel) వెబ్ సిరీస్ ను అతి కష్టం మీద కంప్లీట్ చేసేసింది. ఆ తర్వాత కోయంబత్తూర్ లోని ఇషా ఫౌండేషన్ లో కొంత సమయాన్ని గడిపింది. కాగా, తాజాగా సామ్ తన కొత్త లుక్ ను అభిమానులకు పరిచయం చేసింది.
తన హెయిర్ (Hair)ను పూర్తిగా కట్ చేసి.. షార్ట్ హెయిర్ తో క్యూట్ లుక్ తో అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియోను సామ్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. వీడియోలో బీచ్ వద్ద షార్ట్ హెయిర్ తో చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు సామ్ కొత్త లుక్ కు ఫిదా అవుతున్నారు. ‘సామ్.. చాలా క్యూట్ గా ఉన్నావు’. ‘చాలా అందంగా.. సంతోషంగా కనిపిస్తున్నావు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు సామ్ ప్రస్తుతం వెకేషన్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. తన స్నేహితులతో కలిసి బాలి (Bali) దేశానికి వెళ్లింది. అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నటువంటి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇక సామ్ ప్రొఫెషనల్ లైఫ్ కి వస్తే.. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన ఖుషి (Kushi) చిత్రంలో నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తో కలిసి ‘సిటాడెల్’ (Citadel) వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఈ సిరీస్ షూటింగ్ ను ఇటీవలే కంప్లీట్ చేసింది సామ్. త్వరలో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక సమంత గత కొన్ని రోజులుగా మయోసైటిస్ అనే డిసీజ్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ డిసీజ్ కారణంగా ‘యశోద’ చిత్రం తర్వాత కాస్త విరామం తీసుకున్న సామ్.. ఆ తర్వాత ‘శాకుంతలం’ సినిమాను కంప్లీట్ చేసింది. ఆ వెంటనే ఖుషి, సిటాడెల్ వెబ్ సిరీస్ ను అతి కష్టం మీద పూర్తి చేసింది. ఇక ప్రస్తుతం తన దృష్టి అంతా ఆరోగ్యంపై పెట్టాలనుకుంటోంది. ఇందులో భాగంగానే సామ్ మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంది. ఈ నేపథ్యంలో ఖుషి, సిటాడెల్ తర్వాత ఏ సినిమాలకు సైన్ చేయలేదు. ముందుగా ఒప్పుకున్న ప్రాజెక్టులకు సంబంధించిన అడ్వాన్స్ ను కూడా వెనక్కి తిరిగి ఇచ్చేసిందంటూ ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.
Also Read..
Indonesia | ఘోర పడవ ప్రమాదం.. 15 మంది మృతి.. 19 మంది గల్లంతు
Marathon | మారథాన్ పరుగులో పాల్గొని.. గుండెపోటుతో 20 ఏళ్ల యువకుడి మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Bali
- hair
- holiday Trip
- Samantha
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

