Indian Student | కెనడాలో భారతీయ విద్యార్థిపై దాడి.. చికిత్స పొందుతూ మృతి
Indian Student | కెనడా (Canada)లో గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో ఓ భారతీయ విద్యార్థి (Indian Student) మృతి చెందాడు.
Indian Student | కెనడా (Canada)లో గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో ఓ భారతీయ విద్యార్థి (Indian Student) మృతి చెందాడు. గుర్ విందర్ నాథ్ (24) (Gurvinder Nath ) అనే యువకుడు ఒంటారియా ప్రావిన్స్ (Ontario Province)లో పిజ్జా డెలివరీ బాయ్ (Pizza Delivery Boy) గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో జులై 9వ తేదీన తెల్లవారుజామున 2:30గంటల సమయంలో మిస్సిసాగా (Mississauga) ప్రాంతంలో పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో గుర్ విందర్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అతడి వాహనాన్ని దొంగలించారు.
ఈ దాడిలో గుర్ విందర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ జులై 14న మృతి చెందినట్లు టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం తెలిపింది. గుర్ విందర్ మృతి ఎంతో బాధాకరమని, అతడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. జులై 27న గుర్ విందర్ మృతదేహాన్ని భారత్ కు తరలించనున్నారు. మరోవైపు గుర్ విందర్ పై దాడిని ఖండిస్తూ.. అతడికి నివాళిగా సుమారు 200 మంది భారతీయ విద్యార్థులు మిస్సిసాగాలో క్యాండిల్ లైట్ మార్చ్ నిర్వహించారు.
Also Read..
Samantha | వెకేషన్ లో సామ్.. కొత్త లుక్ లో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తూ..
Sudha Murty | స్టార్ నటి కారణంగా ఏడ్చేసిన సుధామూర్తి..!
Indonesia | ఘోర పడవ ప్రమాదం.. 15 మంది మృతి.. 19 మంది గల్లంతు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

