ఆదివారం 31 మే 2020
Business - Apr 28, 2020 , 23:52:55

ఒకేసారి 8 మందితో..

ఒకేసారి 8 మందితో..

  • వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌

న్యూఢిల్లీ: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఒకేసారి ఎనిమిది మంది మాట్లాడుకునే అవకాశం కల్పించింది సంస్థ. కరోనా వైరస్‌ నేపథ్యంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు డిజిటల్‌ ప్లాట్‌ఫాం కింద కలిసి మాట్లాడుకునే అవకాశం కల్పించడంలో భాగంగా సంస్థ ఈ నూతన ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఫేస్‌బుక్‌ అనుబంధ సంస్థయైన వాట్సాప్‌.. ప్రతిరోజు సరాసరిగా 15 బిలియన్ల నిమిషాల పాటు వీడియో ద్వారా మాట్లాడుతున్నారని తెలిపింది. కరోనా వైరస్‌ వచ్చిన నాటి నుంచి వాయిస్‌, వీడియో కాలింగ్‌ చేసే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. దీంతో ఒకేసారి ఎనిమిది మంది వాయిస్‌ లేదా వీడియో కాల్‌ చేసుకునే అవకాశం కల్పించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 


logo