న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 : ఫోక్స్‌వ్యాగన్.. మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయడానికి సిద్ధమైంది. సింగిల్ చార్జింగ్‌తో 1,000 కిలోమీటర్లు ప్రయాణించే ఈ మాడల్‌ను చైనాలోని షాంఘైలో జరుగుతున్న ఆటో షోలో ప్రదర్శించింది. చైనాకు చెందిన భాగస్వామితో తయారు చేస్తున్న ఈ కారు 2027లో ఉత్పత్తిని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. కృత్రిమ మేధస్సు ఇంటిగ్రేషన్‌తో తయారైన ఈ మూడు ఎస్‌యూవీలు సింగిల్ చార్జింగ్‌తో 700-1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించనున్నది.