Visa Compliants US on India | ఫైనాన్సియల్ పేమెంట్స్ జెయింట్ వీసాకు.. భారత ప్రభుత్వంపై కోపమొచ్చింది. భారత్‌పై అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. భారత్ దేశీయ పేమెంట్స్ సంస్థ రూపేను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా, అనధికారికంగా ప్రోత్సహిస్తున్నదని ఆరోపించింది వీసా. కేంద్ర ప్రభుత్వ చర్య వల్ల తమ సంస్థకు కీలక మార్కెట్ అయిన భారత్‌లో తమ ప్రయోజనాలు దెబ్బ తింటాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నది. యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) కేథరిన్ తాయ్‌తో సీఈవో అల్ఫ్రెడ్ కెల్లీతోపాటు వీసా ఎగ్జిక్యూటివ్‌లు సమావేశమయ్యారు. భారత్‌లో తమకు సమాన అవకాశాల కల్పనపై వీసా సీఈవో అల్ఫ్రెడ్ కెల్లీ ఆందోళన వ్యక్తం చేశారు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) బిజినెస్‌కు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం అధికారిక, అనధికారిక విధానాలు అవలంభిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేసింది వీసా. దేశీయ, అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ కంపెనీలతో పోటీపడుతూ రూపేను ఎన్పీసీఐ నిర్వహిస్తున్నదని పేర్కొంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే రూపేను భారత్ ప్రోత్సహించడంపై 2018లోనూ యూఎస్ట్రేడ్ రిప్రజెంటేటివ్‌కు మరో ఎలక్ట్రానిక్ పేమెంట్స్ సంస్థ మాస్టర్ కార్డ్ ఫిర్యాదు చేసింది. 2012లోనే ఇండియన్ మల్టీ నేషనల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ పేమెంట్స్ సర్వీసుల వ్యవస్థగా రూపేను ఎన్పీసీఐ ప్రారంభించింది.
2020 నవంబర్ నాటికి దేశంలో 95.2 కోట్ల డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను రూపే జారీ చేసింది. ఇది భారత్ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ కార్డ్ బిజినెస్‌లో 63 శాతం. కానీ 2017లో ఇది కేవలం 15 శాతంగా ఉండటం గమనార్హం. 2014లో ప్రధాని నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించాక రూపే కార్డు శక్తిమంతంగా రూపే కార్డు ప్రమోషన్ చేపట్టారు. 2018లో దేశభక్తిని ప్రబోధిస్తూ ప్రధాని నరేంద్రమోదీ భారతీయులంతా రూపే కార్డు వినియోగిస్తే దేశానికి సేవ చేసినట్లేనన్నారు. దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ సరిహద్దులకే వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కరోనా కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అనే ఎందుకు పేరు పెట్టారు? దీనికి చైనా అధ్యక్షుడికి సంబంధమేంటి?
Omicron | ఒమిక్రాన్ అంత ప్రమాదకరమైనదా? దీన్ని చూసి ప్రపంచ దేశాలు ఎందుకు భయపడుతున్నాయి?
Omicron | ఆఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా..
Omicron : కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై నెటిజన్ల మీమ్స్ వైరల్
B.1.1.529 | కరోనా కొత్త వేరియంట్ హెచ్ఐవీ రోగుల నుంచి పుట్టుకొచ్చిందా? ఇది అంత ప్రమాదకరమా?