Sexual Harrasment in Tesla | ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ అనగానే గుర్తుకొచ్చేది టెస్లా.. ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగిని తనపై ఉద్యోగులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, మేనేజర్లు, సూపర్వైజర్లకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉండటం లేదని ఆరోపించారు. శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో గల ఫ్రీమొంట్ ప్లాంట్‌లో పని చేస్తున్న జెస్సికా బర్రాజా అనే ఉద్యోగిని కోర్టులో కేసు వేశారు.
తరుచుగా ఫ్యాక్టరీ ఫ్లోర్‌పై తనను తడుముతున్నా.. ఈ సంగతి తెలిసినా సూపర్వైజర్లు, మేనేజర్లు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. దీంతో తాను రాత్రి వేళ సరిగ్గా నిద్రకూడా పోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికే జాత్యాహంకారం, కోవిడ్-19 ఆంక్షల అమలు తదితర అంశాల్లో ఫ్రీమొంట్ ప్లాంట్ న్యాయ వివాదాలను ఎదుర్కొంటున్న వేళ.. జెస్సికా బర్రాజా వేసిన పిటిషన్ ప్రాధాన్యం సంతరించుకున్నది.
తమ ప్లాంట్‌లోని మరో ఉద్యోగినిని ఇలాగే లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని జెస్సికా తన పిటిషన్లో పేర్కొనడం గమనార్హం. తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేసినందుకు క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకున్నారని ఆమె తన పిటిషన్లో తెలిపారు. జెస్సికా పిటిషన్‌పై స్పందించడానికి టెస్లా అందుబాటులోకి రాలేదు. ఇప్పటి వరకు అధికారికంగా టెస్లా తమ వర్కర్ల పట్ల గౌరవంగా ఉంటామని ప్రకటించింది. వాస్తవమేమిటంటే ఆ సంస్థల్లోని మహిళా ఉద్యోగులు లైంగిక వేధింపులతో రాత్రి వేళ్లలో నిద్రపోవడం లేదని తెలుస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వజ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మహిళ రాధిక మన్నె.. ఎవరామె.. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటి?
jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !
Password : ఇండియన్స్ కామన్‌గా వాడే పాస్వర్డ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Red crabs : కోట్ల సంఖ్యలో రోడ్ల మీదికొచ్చిన పీతలు.. స్థంభించిన జనజీవనం.. ఎక్కడో తెలుసా?
బిచ్చగాడి అంతిమయాత్రకు భారీగా జనం.. కారణం ఏంటి?