e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, April 23, 2021
Advertisement
Home News విప‌ణిలోకి హ్యుండాయ్ అల్కాజ‌ర్‌.. 6 లేదా ఏడు సీట‌ర్ల క్యాబిన్ల‌తో రెడీ

విప‌ణిలోకి హ్యుండాయ్ అల్కాజ‌ర్‌.. 6 లేదా ఏడు సీట‌ర్ల క్యాబిన్ల‌తో రెడీ

విప‌ణిలోకి హ్యుండాయ్ అల్కాజ‌ర్‌.. 6 లేదా ఏడు సీట‌ర్ల క్యాబిన్ల‌తో రెడీ

న్యూఢిల్లీ: దేశీయ విప‌ణిలోకి హ్యుండాయ్ మోటార్ ఇండియా.. అల్కాజ‌ర్ ఎస్‌యూవీ కారును గురువారం ఆవిష్క‌రించింది. త్వ‌ర‌లో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆల‌రించ‌నున్న ఈ ఎస్‌యూవీ కారు.. ఆరు లేదా ఏడు సీట్ల క్యాబిన్ ఆప్ష‌న్ల‌తో రూపుదిద్దుకున్న‌ది. హ్యుండాయ్ అల్కాజ‌ర్ కారులో మిడ్ సైజ్ క్రెటా-5 కంటే ఎక్కువ మంది కూర్చునే వెసులుబాటు క‌లిగి ఉంది. ఇది ఎంజీ మోటార్స్ హెక్టార్ ప్ల‌స్‌, టాటా స‌ఫారీ వంటి మోడ‌ల్ కార్ల‌కు గ‌ట్టి పోటీ ఇవ్వ‌నున్న‌ది.

కారు ప్రాముఖ్య‌త‌ను తెలియ‌జెప్పేలా ఈ మోడ‌ల్‌కు అల్కాజ‌ర్ అని పేరు పెట్టారు. మార్కెటింగ్‌లో దూసుకెళ్ల‌డానికి వీలుగా గ్రాండ్యూర్‌, మ్యాగ్నిఫెన్స్ ఆఫ్ క్యాస్టిల్స్‌కు ప్ర‌తీక‌గా అల్కాజర్ అని డిఫైన్ చేశారు. మేకిన్ ఇండియా స్ఫూర్తితో దేశీయంగా అభివ్రుద్ధి చేసిన మోడ‌ల్ కారు ఇది.

అల్కాజ‌ర్ ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా హ్యుండాయ్ సీఈవో కం ఎండీ ఎస్ఎస్ కిమ్ మాట్లాడుతూ త‌మ సంస్థ వినియోగ‌దారుల ఆకాంక్ష‌ల‌ను లోతుగా అర్ధం చేసుకుంటుంద‌న్నారు. అల్కాజ‌ర్ రూప‌క‌ల్ప‌న‌లో ప్ర‌తి అంశానికి త‌మ ఆర్ అండ్ సెంట‌ర్ గంట‌ల త‌ర‌బ‌డి స‌మ‌యం కేటాయించి శ్ర‌మించార‌న్నారు.

మేకిన్ ఇండియా రిచ్ హెరిటేజ్, ప్రీమియం అండ్ సుపీరియ‌ర్ మాన్యుఫాక్చ‌రింగ్ శ‌క్తి సామ‌ర్థ్యాల ఫ‌లిత‌మే అల్కాజ‌ర్ అని ఎస్ఎస్ కిమ్ అభిప్రాయ ప‌డ్డారు. మేకిన్ ఇండియా స్పూర్తితో తాము ప‌ర్‌ఫెక్ట్‌గా వైభ‌వోపేతమైన కారుగా అల్కాజ‌ర్‌ను రూపొందించామ‌ని చెప్పారు.

అల్కాజ‌ర్ రంగ ప్ర‌వేశంతో హ్యుండాయ్ నూత‌న సెగ్మెంట్‌లోకి ఎంట‌ర్ అవ్వ‌డానికి రంగం సిద్ధం అయ్యింద‌న్నారు ఎస్ఎస్ కిమ్‌. త‌మ క‌స్ట‌మ‌ర్ల ఆకాంక్ష‌లు, బెంచ్‌మార్క్‌ల రీ డిఫైనింగ్‌తో అల్కాజ‌ర్‌ను రూపొందించామ‌న్నారు.

సెన్సౌస్ స్పోర్టీనెస్‌తో కూడిన గ్లోబ‌ల్ డిజైన్ ఐడెంటిటీ ఆధారంగా అల్కాజ‌ర్ రూపుదిద్దుకుంది. క్రెటాతో పోలిస్తే విభిన్నంగా ఉంటుంది అల్కాజ‌ర్‌. స్పేసియ‌స్ వింగ్ స‌రౌండెడ్ ఆర్కిటెక్చ‌ర్‌, కంఫ‌ర్ట్, మోడ‌ర్న్ ఇన్ కార్ ఎక్స్‌పీరియ‌న్స్ వంటి ఇంటీరియ‌ర్ ఫీచ‌ర్లు జ‌త క‌లిశాయి. ఆరు సీట్ల వేరియంట్‌లో కెప్టెన్ టైప్ సీట్లతో కంఫ‌ర్ట్‌గా ఉంది.

స్లైడింగ్ సీట్ల‌తో క్యాబిన్ రూపుదిద్దుకున్న‌ది. క్రెటా వీల్ బేస్ 2610 మి.మీ. కాగా, 150 మి.మీ. ఎక్కువ‌గా ఆల్కాజ‌ర్ వీల్ బేస్ 2660 మి.మీగా ఉంది. ఎకో, సిటీ, స్పోర్ట్ మోడ్‌ల‌లో విభిన్న‌మైన డ్రైవ్ మోడ్ సెల‌క్ష‌న్ ఫీచ‌రింగ్ ఉంది.

హ్యుండాయ్ అల్కాజ‌ర్ మూడోత‌రం న్యూ 2.0 లీట‌ర్ల పెట్రోల్ బీఎస్‌-6 ఇంజిన్‌తో అందుబాటులోకి వ‌స్తుంది. ఇది 156 పీఎస్, 19.5 కేజీఎం టార్చిని విడుద‌ల చేస్తుంది. యూ2 1.5 లీట‌ర్ల డీజిల్ బీఎస్‌-6 ఇంజిన్‌తోపాటు 115 పీఎస్‌, 25.5 కేజీఎం టార్చిని రిలీజ్ చేస్తుంది.

6ఏటీ, 6 ఎంటీ ట్రాన్సిమిష‌న్ ఆప్ష‌న్ల‌లో హ్యుండాయ్ అల్కాజ‌ర్ ల‌భ్యం అవుతుంది. మూడోత‌రం న్యూ 2.0 లీట‌ర్ల పెట్రోల్ బీఎస్‌6 ఇంజిన్ (6ఎంటీ).. కేవ‌లం 10 సెక‌న్ల‌లో 100 కిలోమీట‌ర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఇవి కూడా చ‌ద‌వండి:

అంబానీలపై 25 కోట్ల ఫైన్‌

ఫ్యూచ‌ర్‌-రిల‌య‌న్స్ డీల్‌పై సుప్రీంకు అమెజాన్‌

స్వదేశీ పరిజ్ఞానంతో ఆయిల్‌ రిగ్గులు

పసిడి పరుగు

భారత్‌లోని 3 నగరాల్లో షోరూంలు తెరుస్తున్న టెస్లా

ఏసీలు, ఎల్‌ఈడీ లైట్ల కోసం పీఎల్‌ఐ పథకం

బజాజ్‌ అలియాంజ్‌ సరికొత్త బీమా

మహీంద్రాతో ఫ్లిప్‌కార్ట్‌ డీల్

దివాళా అంచున కాఫీడే.. ఎందుకంటే..!

హోంలోన్ కావాలా.. టాప్ 10 ప్రైవేట్ బ్యాంకుల్లో ఇలా బెస్ట్

నెల రోజులు హైద‌రాబాద్‌లోనే ర‌జినీకాంత్‌

Advertisement
విప‌ణిలోకి హ్యుండాయ్ అల్కాజ‌ర్‌.. 6 లేదా ఏడు సీట‌ర్ల క్యాబిన్ల‌తో రెడీ

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement