Twitter Lay Offs | ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ (Micro Blogging Site) ట్విట్టర్ (Twitter) తమ ఉద్యోగులకు మరోసారి ఝలక్ ఇచ్చింది. ఇప్పటికే భారీగా లేఆఫ్స్ ప్రకటించిన సంస్థ.. తాజాగా మరోసారి ఉద్యోగులను పీకేసింది. సుమారు 200 మందికి లేఆఫ్స్ ప్రకటించింది.
గతేడాది ట్విట్టర్‌ను (Twitter) టేకోవర్ చేసిన వెంటనే ఉన్నతాధికారులపై వేటు వేసిన బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk)ఆపై మాస్ లేఆఫ్స్‌తో పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. మస్క్ హయాంలో ట్విట్టర్ (Twitter)లో మెజారిటీ ఉద్యోగులు కొలువులు కోల్పోవడమో, రాజీనామాతో కంపెనీని వీడటమే జరిగింది. కాగా, 2022 నవంబర్‌లో ఇక లేఆఫ్స్ ఉండవని ట్విట్టర్ న్యూ బాస్ మస్క్ స్పష్టం చేశారు. అయితే, అందుకు విరుద్ధంగా మస్క్ ప్రవర్తిస్తున్నారు. తాజాగా మరోసారి కంపెనీలో భారీగా లేఆఫ్స్ చేపట్టారు. ఈసారి ఇంజినీరింగ్ (Engineering), ప్రాడక్ట్ (Product) విభాగాల్లో ఉద్యోగులను తొలగించారు.
సుమారు ఈసారి 200 మంది ఉద్యోగులను తొలగించారు. ఇది ట్విట్టర్ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం. కాగా, ఉద్యోగాలు పోయిన వారిలో ప్రొడక్ట్ మేనేజర్లు, డేటా సైంటిస్టులు, మెషీన్ లెర్నింగ్‌పై పనిచేసే ఇంజినీర్లు ఉన్నట్లు ఈ వ్యవహారం గురించి తెలిసిన కొందరు వ్యక్తులు చెప్పారు. ఉద్యోగం నుంచి తమను తొలగించినట్టు ఈమెయిల్స్ (E-mails) వచ్చాయని కొందరు ట్విట్టర్ ఉద్యోగులు (Twitter Employees) తెలిపారు.
Just got confirmation that Esther Crawford, chief executive of Twitter Payments, is out.
— Zoë Schiffer (@ZoeSchiffer) February 26, 2023
ఇంటర్నల్ సిస్టమ్‌లోకి ( internal system) లాగిన్ కాలేకపోయామని.. దీంతో తమను తొలగించారనే విషయాన్ని అర్థం చేసుకున్నామని మరికొందరు పేర్కొన్నారు. తాజా లేఆఫ్ లో కంపెనీ ఎగ్జిక్యూటివ్ హోదాలో పని చేస్తున్న ఎస్తర్ క్రాఫోర్డ్ (Esther Crawford) కూడా ఉన్నారు. సబ్ స్క్రిప్షన్ సర్వీస్ బ్లూటిక్ ఇన్చార్జ్ గా ఆయన వ్యవహరిస్తున్నారు. మరోవైపు ట్విట్టర్ యాజమాన్యం తీసుకుంటున్న చర్యలతో ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు తీవ్ర అభద్రతాభావానికి గురవుతున్నారు.
Also Read..
“Twitter Layoffs | మస్క్ మాటలకు అర్ధాలే వేరులే… : లేఆఫ్స్ లేవంటూనే మళ్లీ కొలువుల కోత..!”
Ram Charan | రామ్ చరణ్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం.. ఆర్ఆర్ఆర్ నటుడి స్పందన ఇదీ..!
Joseph Manu James | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువ దర్శకుడు కన్నుమూత