న్యూఢిల్లీ, జూన్ 11 : రిజర్వుబ్యాంక్ కీలక వడ్డీరేట్లను అరశాతం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మరో మూడు ప్రభుత్వరంగ బ్యాంకులు వడ్డీరేట్లను అరవాతం వరకు కోత పెట్టాయి. వీటిలో కెనరా బ్యాంక్‌తోపాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు ఉన్నాయి. ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు(ఈబీఎల్ఆర్), రెపో లింక్డ్ లెండింగ్ రేటు(ఆర్ఎల్ఎల్ఆర్)ని 50 బేసిస్ పాయింట్లు తగ్గించినట్టు యూనియన్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు ప్రకటించాయి.
కానీ, కెనరా బ్యాంక్ ఆర్ఎల్ఎల్ఆర్ని 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. బ్యాంకులు తీసుకున్న తాజా నిర్ణయంతో నూతన, పాత రిటైల్(గృహ, వాహన, వ్యక్తిగత) రుణాలు, ఎంఎస్ఎంఈ రుణాలు తీసుకున్నవారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగనున్నాయి.