IIP | న్యూఢిల్లీ, ఆగస్టు 12: దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఈ జూన్లో 5 నెలల కనిష్టాన్ని తాకుతూ 4.2 శాతంగానే ఉన్నది. జనవరి తర్వాత ఇప్పుడే ఆ స్థాయి గణాంకాలు నమోదయ్యాయని సోమవారం విడుదలైన అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. ఇక గనులు, విద్యుత్తు రంగాలు బాగున్నా.. కీలకమైన తయారీ రంగం నెమ్మదించింది.
రిటైల్ ద్రవ్యోల్బణం గత నెల ఐదేండ్ల కనిష్టానికి తగ్గింది. జూలైలో 3.54 శాతంగా ఉన్నట్టు ఎన్ఎస్వో ప్రకటించింది. 2019 సెప్టెంబర్లో 3.99 శాతంగా నమోదైంది. మళ్లీ ఇప్పుడే ఆ స్థాయి కంటే తక్కువకు చేరింది.
ఇక అంతకుముందు నెల జూన్లో ఈ వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు 5.08 శాతంగా ఉండగా, నిరుడు జూలైలో 7.44 శాతంగా ఉన్నది. ఆహార ద్రవ్యోల్బణం కొంతమేర అదుపులోకి రావడం కలిసొచ్చింది. మరోవైపు తాజా గణాంకాలతో ఆర్బీఐ రాబోయే ద్రవ్య సమీక్షల్లో వడ్డీరేట్లను తగ్గిస్తుం దన్న ఆశలు చిగురిస్తున్నాయి.