దేశంలో పారిశ్రామికోత్పత్తి పడకేసింది. ప్రధాన రంగాల్లో వృద్ధిరేటు మునుపటితో పోల్చితే దారుణంగా పడిపోయింది. కీలకమైన తయారీ, గనులు, విద్యుత్తు రంగాల్లో ఉత్పాదకత భారీగా క్షీణించడం గమనార్హం.
దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఈ జూన్లో 5 నెలల కనిష్టాన్ని తాకుతూ 4.2 శాతంగానే ఉన్నది. జనవరి తర్వాత ఇప్పుడే ఆ స్థాయి గణాంకాలు నమోదయ్యాయని సోమవారం విడుదలైన అధికారిక గణాంకాలు చెప్తున్నాయి.