134 కోట్లకు టెలికాం సబ్‌స్ర్కైబర్లు
దేశవ్యాప్తంగా టెలికాం సబ్‌స్ర్కైబర్లు వాయువేగంతో దూసుకుపోతున్నారు. మే నెల చివరినాటికి మొత్తం వినియోగదారులు 134 కోట్లకు చేరుకున్నట్టు టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది.
న్యూఢిల్లీ, జూన్ 25: దేశవ్యాప్తంగా టెలికాం సబ్‌స్ర్కైబర్లు వాయువేగంతో దూసుకుపోతున్నారు. మే నెల చివరినాటికి మొత్తం వినియోగదారులు 134 కోట్లకు చేరుకున్నట్టు టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది. భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లోకి అదనంగా పలువురు చేరినట్టు తెలిపింది. గత నెలలో ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లోకి కొత్తగా 29.8 లక్షల మంది చేరగా, వీరిలో 29.26 లక్షల మంది మొబైల్ వినియోగదారులు కాగా, 53,809 ఫిక్స్డ్ లైన్ కనెక్షన్లు అని పేర్కొంది.
అలాగే రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లోకి కొత్తగా 22.55 లక్షల మంది చేరినట్టు తెలిపింది. వీరిలో 21.54 లక్షల మంది మొబైల్ సెగ్మెంట్నకు చెందిన వారు కాగా, 1.01 లక్షలు ఫిక్స్డ్ లైన్ కనెక్షన్లు. ఏప్రిల్ చివరి నాటికి 133.75 కోట్లుగా ఉన్న టెలిఫోన్ సబ్‌స్ర్కైబర్లు.. ఆ తర్వాత నెల చివరినాటికి 134.41 కోట్లకు చేరుకున్నారని ట్రాయ్ తాజా నివేదికలో వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

