BSNL | న్యూఢిల్లీ, ఆగస్టు 1: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్‌ను ఆవిష్కరించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సంస్థ నెల రోజుల కాలపరిమితితో రూ.1 ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల దేశవ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించిన సంస్థ..కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ నూతన ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తించనున్నదని పేర్కొంది.
ఈ ప్లాన్‌లో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తోపాటు ప్రతీ రోజు 2 జీబీ హై-స్పీడ్ డాటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ పంపుకోవచ్చునని బీఎస్ఎన్ఎల్ సీఎండీ ఏ రాబర్ట్ జే రవి తెలిపారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ మిషన్‌లో భాగంగా ప్రతీ ఒక్కరికి 4జీ సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ నూతన ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు, దీంట్లోభాగంగా ఉచితంగా సిమ్‌ను కూడా అందిస్తున్నట్టు చెప్పారు. ఇతర పోటీ సంస్థలైన జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు రూ.349, రూ.379, రూ.399 చొప్పున ప్లాన్లను అందిస్తున్నాయి.