హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : సత్యం కంప్యూటర్స్ సంస్థను చేజికించుకున్న టెక్ మహీంద్రా కంపెనీకి హైకోర్టులో ఊరట లభించింది. 2002-09 మధ్య కాలానికి సంబంధించి సత్యం కంప్యూటర్స్ చెల్లించాల్సిన ఆదాయ పన్నును ఆ కంపెనీ వాస్తవ ఆదాయం ఆధారంగానే లెకించాలని శుక్రవారం హైకోర్టు తీర్పు చెప్పింది. సత్యం కుంభకోణం నేపథ్యంలో ఆ కంపెనీ వాస్తవ ఆదాయం ఆధారంగా పన్ను మదింపునకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ‘టెక్ మహీంద్రా’ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ ఎన్ తుకాంజీలతో ధర్మాసనం విచారణ జరిపింది.