e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home బిజినెస్ మిస్త్రీపై టాటా పైచేయి

మిస్త్రీపై టాటా పైచేయి

మిస్త్రీపై టాటా పైచేయి

సైరస్‌ తొలగింపు సబబేనన్న సుప్రీం కోర్టు
ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పు చెల్లదని స్పష్టీకరణ

న్యూఢిల్లీ, మార్చి 26: సైరస్‌ మిస్త్రీ కేసులో టాటా గ్రూపు భారీ విజయం సాధించింది. టాటా సన్స్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని తిరిగి నియమించాలంటూ గతంలో నేషనల్‌ కంపెనీ లా అప్పిలెట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో టాటా గ్రూపు చేసుకున్న అప్పీళ్లపై చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బొపన్న, వీ రామసుబ్రమణియన్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. ‘టాటా సన్స్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని తిరిగి నియమించాలంటూ 2019 డిసెంబర్‌లో ఎన్‌సీఎల్‌ఏటీ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తున్నాం. ఆ తీర్పు చెల్లుబాటు కాదు. మిస్త్రీని తొలగించాలన్న టాటా సన్స్‌ నిర్ణయం సరైనదే’ అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో కార్పొరేట్‌ వార్‌లో సైరస్‌ మిస్త్రీకి భారీ షాక్‌ తగిలింది. 2016 అక్టోబర్‌లో టాటా సన్స్‌ చైర్మన్‌ పదవి నుంచి సైరస్‌ మిస్త్రీని తొలగించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం చెల్లుబాటు కాదని, టాటా సన్స్‌ చైర్మన్‌గా మిస్త్రీని తిరిగి నియమించాలని 2019 డిసెంబర్‌ 18న ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును టాటా సన్స్‌ 2020 జనవరి 2న సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఆ తర్వాత ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పును టాటా గ్రూప్‌ సంస్థల అధిపతి రతన్‌ టాటా కూడా సర్వోన్నత న్యాయస్థానంలో సవాలు చేశారు. దీంతో ఆ తీర్పుపై సుప్రీం కోర్టు గతేడాది జనవరిలోనే స్టే విధించింది. అంతేకాకుండా టాటా సన్స్‌లో ఉన్న షేర్లను ఎక్కడా తాకట్టు పెట్టరాదని 2020 సెప్టెంబర్‌ 2న షాపూర్‌జీ పల్లోంజీ సంస్థకు స్పష్టం చేసింది. గతేడాది డిసెంబర్‌ 8న ఈ కేసులో తుది వాదనలను విన్న సుప్రీం కోర్టు.. అదే నెల 17న తీర్పును రిజర్వులో పెట్టింది. ఇప్పుడు టాటా సన్స్‌కు అనుకూలంగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో ఈ కేసుకు తెరపడినట్లయింది.
‘ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పు చెల్లుబాటు కాదని స్పష్టం చేసిన సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది గెలుపోటములకు సంబంధించిన అంశం కాదు. నా కచ్చితత్వంపై, మా సంస్థ నైతిక ప్రవర్తనపై భీకర దాడులు జరిగాయి. ఈ వ్యవహారంపై టాటా సన్స్‌ వాదనల్లో వాస్తవమున్నదని సుప్రీం కోర్టు తీర్పు రుజువు చేసింది. అంతేకాకుండా టాటా సన్స్‌ పాటించే విలువలకు, నైతికతకు ఈ తీర్పు అద్దం పట్టింది. మన న్యాయ వ్యవస్థ గొప్పతనాన్ని ఈ తీర్పు మరింత బలపర్చింది’

రతన్‌ టాటా, టాటా గ్రూపు సంస్థల అధిపతి

Advertisement
మిస్త్రీపై టాటా పైచేయి
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement