Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్లాట్‌గా ముగిశాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ లాభాల్లో మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతో మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం వరకు కోలుకున్నా.. చివరలో మళ్లీ నష్టాల్లోకి జారుకున్నది. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 4.41 పాయింట్ల పతనంతో 82,555.44 వద్ద ముగిసింది. నిఫ్టీ 1.15 పాయింట్ల లాభంతో 25,279.85 వద్ద స్థిరపింది. నిఫ్టీలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ లాభపడ్డాయి. ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, జెఎస్డబ్ల్యు స్టీల్, అదానీ పోర్ట్స్ నష్టపోయాయి.
బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం పెరిగాయి. మీడియా, పవర్, మెటల్, రియాల్టీ మరియు ఆయిల్, గ్యాస్ 0.5-1.5 శాతం పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ స్వల్ప లాభాలతో ముగియగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగింది. అబాట్ ఇండియాతో సహా 250కి పైగా స్టాక్‌లు బీఎస్ఇలో 52 గరిష్ఠానికి చేరాయి. ఇందులో బాంబే బర్మా, ఎరిస్ లైఫ్, గోద్రెజ్ ఇండస్ట్రీస్, హెచ్ఎఫ్సీఎల్, జిందాల్ సా, జేఎం ఫైనాన్షియల్, లుపిన్, ఎంఅండ్ఎం ఫైనాన్షియల్, ఎంఫాసిస్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, పీసీబీఎల్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, పీఐ ఇండస్ట్రీస్, పాలీ మెడిక్యూర్, క్వెస్ కార్ప్, వోల్ట్, శ్రీరామ్ ఫైనాన్స్ ఉన్నాయి.