Stock Markets : స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 863 పాయింట్ల లాభంతో 79,442 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 299 పాయింట్ల లాభంతో 24,292 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలు దేశీయ సూచీలకు దన్నుగా నిలిచాయి.
ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1046 పాయింట్లు, నిఫ్టీ 313 పాయింట్ల మేర లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఆల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, ఐటీసీ, మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా, పవర్గ్రిడ్సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. అదే సమయంలో ఏసియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, కోటక్ బ్యాంక్, టైటాన్ సూచీలు నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ల విషయానికి వస్తే.. మంగళవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆసియాలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ అన్నీ మంచి లాభాల్లో ట్రేడవుతున్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, మంగళవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.3,531 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేశారు. మరోవైపు దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.3,357 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.