ముంబై, డిసెంబర్ 3: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో సూచీలు కదంతొక్కాయి. ఇంట్రాడేలో 700 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 597.67 పాయింట్లు అందుకొని 80,845.75 వద్ద ముగిసింది.
మరో సూచీ నిఫ్టీ 181.10 పాయింట్లు అందుకొని 24,457.15 వద్ద నిలిచింది. అదానీ గ్రూపు షేర్లు క్రమంగా కోలుకుంటున్నాయి. స్టాక్ మార్కెట్లో లిైస్టెన 11 సంస్థల్లో ఏడు కంపెనీలు లాభాల్లో ముగిశాయి. వీటితోపాటు ఎయిర్టెల్, ఐటీసీ, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, కొటక్ మహీంద్రాలు నష్టపోయాయి.