ముంబై, ఏప్రిల్ 15: దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. ప్రతీకార సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు మినహాయింపునిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతోపాటు ఆటోమొబైల్స్‌పై సుం కాలను తగ్గించే యోచనలో ఉన్నట్టు వచ్చిన వార్తల వల్ల అంతర్జాతీయంగా మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఇదే క్రమంలో దేశీయ సూచీలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ 1,577.63 పాయింట్లు లేదా 2.10 శాతం లాభపడి 76,734.89 వద్ద ముగియగా.. నిఫ్టీ సైతం 500 పాయింట్లు (2.19 శాతం) అందుకొని 23 వేల మార్క్‌ను అధిగమించి 23,328.55 వద్ద ముగిసింది.
సూచీలు వరుస లాభాలతో దూసుకుపోతుండటంతో మదుపరులు భారీగా సంపదను పోగేసుకున్నారు. రెండు రోజుల్లో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.18,42,028.91 కోట్లు ఎగబాకి రూ.4,12,24,362.13 కోట్లు(4.81 ట్రిలియన్ డాలర్లు) చేరుకున్నట్టు అయింది.