ముంబై, మార్చి 24: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస పతనాలకు బ్రేక్‌పడింది. ఐదు రోజులపాటు ఇరాన్‌పై దాడులు చేయబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో సూచీలు తిరిగి లాభాల్లోకి రాగలిగాయి. లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. ఒక దశలో 1,800 పాయింట్ల వరకు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 74 వేల పాయింట్లను అధిగమించింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 1,372.06 పాయింట్లు లేదా 1.89 శాతం బలపడి 74,068.45 వద్ద స్థిరపడింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 399.75 పాయింట్లు లేదా 1.78 శాతం అందుకొని 22,912.40 వద్ద ముగిసింది.
స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడటంతో మదుపరుల సంపద అమాంతం పెరిగింది. బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.7.56 లక్షల కోట్లు పెరిగి రూ.4,22,78, 312.77 కోట్లు(4.50 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకున్నది. హర్ముజ్ జలసంధిని వెంటనే తెరువాలని లేకపోతే దాడుల తీవ్రతరం చేస్తామని గతంలో హెచ్చరించిన ట్రంప్..ఈసారి మాటమార్చి గడువును పొడిగిస్తున్నట్టు ప్రకటించడంతో మదుపరుల్లో ఉత్సాహం ఉరకలెత్తిందని లైవ్‌లాంగ్ వెల్త్ రీసర్చ్ సీనియర్ అనలిస్ట్ హరిప్రసాద్ కే తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలతో బ్యారెల్ క్రూడాయిల్ ధర 11 శాతం తగ్గడం సూచీల్లో జోష్ పెంచిందని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. ఎల్అండ్టీ, ఇండిగో, ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నాలుగు శాతానికి పైగా లాభపడ్డాయి.
వీటితోపాటు అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీం ద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, బీఈఎల్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, మారుతి, ఎన్టీపీసీ, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, ట్రెంట్, రిలయన్స్, ఐటీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి.