ముంబై, ఫిబ్రవరి 20 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ నష్టపోయాయి. టారిఫ్ ఆందోళనలు పెరుగుతుండటం, ఆసియా మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతుండటం, ఎఫ్ఐఐలు పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటం మదుపరుల సెంటిమెంట్‌ను నీరుగార్చింది. ఫలితంగా ఇంట్రాడేలో 500 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరికి 203.22 పాయింట్లు కోల్పోయి 75,735.96 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ సైతం 19.75 పాయింట్లు నష్టపోయి 22,913.15 వద్ద నిలిచింది. బ్లూచిప్ సంస్థల షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు విలువ 2.35 శాతం తగ్గి టాప్ లూజర్‌గా నిలిచింది.