Stock Markets | స్టాక్ మార్కెట్లు భారీ పతనం.. సెన్సెక్స్ 893 పాయింట్లు లాస్
Stock Markets : భారతీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 893 పాయింట్లు, నిఫ్టీ 278 పాయింట్లు నష్టపోయాయి. ఉదయం ట్రేడింగ్ 57 పాయింట్ల నష్టంతో 77,061 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.
Stock Markets : భారతీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 893 పాయింట్లు, నిఫ్టీ 278 పాయింట్లు నష్టపోయాయి. ఉదయం ట్రేడింగ్ 57 పాయింట్ల నష్టంతో 77,061 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ కూడా 31 పాయింట్ల నష్టంతోనే ప్రారంభమైంది. ఉదయం నుంచి కొనసాగిన లాస్ ట్రెండ్ ట్రేడింగ్ ముగిసే వరకు కొనసాగింది.
ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 893.39 పాయింట్లు (1.16 శాతం) నష్టపోయి 76,200.68 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 278.80 పాయింట్లు (1.16%) కోల్పోయి 23,824.10 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 94.74 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 77.49 డాలర్ల వద్ద కొనసాగింది. ఔన్స్ బంగారం ధర 4130 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ 30 సూచీలో సన్‌ఫార్మా, పవర్ గ్రిడ్, మారుతీ సుజుకి షేర్లు లాభాలు పొందగా, ఐటీ స్టాక్స్ తీవ్రంగా నష్టపోయాయి. ఇన్ఫోసిస్ షేర్లు 3.36 శాతం, టీసీఎస్ 3.16 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 1.79 శాతం, టెక్ మహీంద్రా 1.31 శాతం నష్టపోయాయి.
అలాగే, బీఈఎల్, అదానీ స్పోర్ట్స్, టాటా స్టీల్ కూడా భారీగా నష్టపోయాయి. మెటల్ స్టాక్స్ కూడా నష్టాల్లోనే కొనసాగాయి. ఫార్మా షేర్లు మాత్రం స్వల్పంగా లాభాలు పొందాయి. ఇండియాతోపాటు జపాన్, ఇతర ఆసియా మార్కెట్లు, అంతర్జాతీయా మార్కెట్లు కూడా మంగళవారం నష్టాల్లోనే ముగిశాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- infosys
- nifty
- Sensex
- Stock Markets
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

