బుధవారం 03 జూన్ 2020
Business - Apr 28, 2020 , 18:14:01

రెండో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

రెండో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

 ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి.  లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఆసియా మార్కెట్లు సంకేతాలతో ఆరంభంలో 300 పాయింట్లకు పైగా ఎగిసిన కీలక సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. మ‌ళ్లీ వెంట‌నే తేరుకుని మిడ్ సెషన్ నుంచి భారీగా పుంజుకుని తిరిగా లాభాల్లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 371 పాయింట్లు లాభపడి 32,115కి పెరిగింది. నిఫ్టీ 99 పాయింట్లు పుంజుకుని 9,381కి ఎగబాకింది. ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ , హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ , యాక్సిస్ బ్యాంక్ , ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్ర  బ్యాంకులతో పాటు, బజాజ్ ఫిన్స్, గెయిల్, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, టెక్ మహీంద్ర లాభపడ్డాయి. సన్ ఫార్మా, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు న‌ష్ట‌పోయాయి


logo