Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లలో అస్థిరత కారణంగా మార్కెట్లు నష్టపోయాయి. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 35.68 క్షీణించి 61,904.52 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 18.10 పాయింట్లు తగ్గి 18,297.00 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇవాళ ఉదయం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు కొద్దిసేపటికే నష్టాల్లోకి వెళ్లాయి. ఉదయం సెన్సెక్స్ 62,158.10 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలై ఇంట్రాడేలో 62,168.22 పాయింట్ల గరిష్ఠాన్ని తాకి.. చివరకు 61,904.52 వద్ద ముగిసింది. నిఫ్టీ 18,357.80 దగ్గర వద్ద మొదలై.. ఇంట్రాడేలో 18,389.70 గరిష్ఠాన్ని తాకి చివరకు చివరకు 18.10 పాయింట్ల నష్టపోయి 18,297 దగ్గర స్థిరపడింది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు ఐదు శాతం పెరగ్గా.. ఇంద్రప్రస్థ గ్యాస్ మూడు శాతం క్షీణించింది. ఏషియన్ పేయింట్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్‌యూఎల్, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, టాటా స్టీల్, మారుతీ, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, టైటన్, విప్రో, ఎల్అండ్టీ తదితర షేర్లు లాభపడ్డాయి. లార్సెన్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, టాటాస్టీల్, డాక్టర్ రెడ్డీస్, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్స్, భారతీ టాటా మోటార్స్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, నెస్లే ఇండియా, హిందాల్కో, దివిస్ ల్యాబ్, ఏఎస్ డబ్ల్యూ సిమెంట్ తదితర షేర్లు నష్టపోయాయి.