Stock Market | వారంలో తొలిరోజైన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 170.89 పాయింట్లు కోల్పోయి 61,624 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరో వైపు నిఫ్టీ 20.50 పాయింట్లు తగ్గి 18,329 పాయింట్ల వద్ద ముగిసింది. ఒడిదుడుకుల మధ్య స్టాక్ మార్కెట్లు మొదలయ్యాయి. అమెరికా, ఇతర ఆసియా మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో భారత మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. భారత టోకు ద్రవ్యోల్బణం అంచనాల కంటే దిగువకు పడిపోయింది.
ఇందుకు తయారీ వస్తువులు, ఇంధనం, విద్యుత్ ధరలు మందగించడం సహాయపడిందని అని వినోద్ నాయర్ చెప్పారు. ఇవాళ ట్రేడింగ్‌లో హిందాల్కో ఇండస్ట్రీస్, అపోలో హాస్పిటల్స్, టాటా మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, కొటక్ మహీంద్రా బ్యాంక్ నిఫ్టీలో అత్యధికంగా లాభయపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, ఐటీసీ, కోల్ ఇండియా, హెచ్‌యూఎల్, ఎస్బీఐ నష్టపోయాయి. బీఎస్ఈలో రియల్టీ, మెటల్ సూచీలు ఒక్కొక్కటి ఒక శాతం పెరగ్గా.. హెల్త్‌కేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక్కొక్కటి 0.5 శాతం లాభపడ్డాయి. ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ ఒక శాతం, పవర్ ఇండెక్స్ 0.7 శాతం క్షీణించాయి.