Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీన సంకేతాల నేపథ్యంలో దేశీయ సూచీలు సైతం స్తబ్దుగా మొదలయ్యాయి. ఆ తర్వాత కోలుకోలుకున్నట్లు కనిపించినా.. ట్రేడింగ్ ముగిసే సమయంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించి అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 3.94 పాయింట్ల లాభంతో 65,220.03 పాయింట్లు, నిఫ్టీ 2.90 పాయింట్లు పెరిగి 19,396.50 వద్ద ముగిశాయి. దాదాపు 2,150 షేర్లు పురోగమించగా.. 1390 క్షీణించాయి. 124 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐటీసీ, ఎన్టీపీసీ, హీరో మోటోకార్ప్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. బీపీసీఎల్, సిప్లా, బజాజ్ ఫిన్సర్వ్, ఐషర్ మోటార్స్, టీసీఎస్ లూజర్స్‌గా నిలిచాయి.