Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ మరోసారి జీవనకాల గరిష్ఠానికి చేరాయి. సెన్సెక్స్ 851.63 పాయింట్లు పెరిగి 70వేల పాయింట్ల ఎగువ ట్రేడవుతున్నది. నిఫ్టీ 230 పాయింట్లకుపైగా పెరిగింది. ప్రస్తుతం సెన్సెక్స్ 70,433.82 పాయింట్ల వద్ద, నిఫ్టీ 21,163.15 పాయింట్ల వద్ద నిఫ్టీ టేడ్రవుతున్నది. ఇవాళ ఉదయం సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయం తీసుకున్నది. ద్రవ్యోల్బణం ఇంకా 2శాతం లక్ష్యం కంటే ఎగువన ఉండడంతో కఠిన వైఖరిని కొనసాగిస్తూ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం దేశీయ మార్కెట్ల సానుకూల ప్రభావం చూపింది. ఈ క్రమంలో సూచీలు మరోసారి జోరును కొనసాగిస్తున్నాయి. ఉదయం సెన్సెక్స్ 665 పాయింట్ల లాభంతో 70,249 పాయింట్లు, నిఫ్టీ 186 పాయింట్లు పెరిగి 21,112 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇంట్రాడేలోనూ అదే రోజును కొనసాగిస్తున్నాయి. ఇక ట్రేడింగ్‌లో టెక్ మహీంద్రా, ఎల్‌టీఐమైండ్ ట్రీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్‌గా నిలువగా.. పవర్ గ్రిడ్ కార్పోరేషన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే, బీపీసీఎల్, టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.