హుజురాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో తనకు కౌన్సిలర్‌గా ఒక అవకాశం ఇస్తే వార్డును ఆదర్శంగా తీర్చిదిద్ది చూపిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి దాసి కుమారస్వామి (Dasi Kumaraswamy) పేర్కొన్నారు. శనివారం 28వ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలుస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను, అందించిన సంక్షేమ పథకాలను కుమారస్వామి వివరించారు.
తాను ఎల్లప్పుడు వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పిన కుమారస్వామి.. శక్తి మేరకు వార్డు ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. వార్డులోని అందరి ఇంట్లోని వ్యక్తిగాటానని, వార్డులో ఉన్న సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని కుమారస్వామి తెలిపారు. కాబట్టి.. ఎన్నికల్లో తనను ఆదరించి ఆశీర్వదించి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.