IND vs USA : టీ20 ప్రపంచకప్ తొలి పోరులో సూర్యకుమార్ యాదవ్(84 నాటౌట్) ప్రచండ సూర్యుడిలా ప్రతాపం చూపించాడు. వాంఖడేలో యూఎస్ఏ బౌలర్ల జోరుతో సహచరులు ఆడలేక ఔటైన చోట తానొక్కడే నిలబడి జట్టుకు ఊహించనంత స్కోర్ అందించాడు. 72కే సగం వికెట్లు పడినా.. పవర్ హిట్టర్ల నుంచి సహకారం అందకున్నా ఒంటరి సైనికుడులా చెలరేగాడు సూర్య. ఆఖరి ఓవర్లో.. 4, 6, 6, 4తో జట్టు స్కోర్ 160 దాటించాడు సూర్య.
లీగ్ దశ తొలి మ్యాచ్‌లో భారత ప్రత్యర్థి యూఎస్ఏ అనగానే భారీ స్కోర్ ఖాయమనుకున్నారంతా. కానీ, టాస్ ఓడి బ్యాటింగ్ చేయాల్సి రావడం.. అమెరికన్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రెండో ఓవర్లోనే అంతా తలకిందులైంది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో నేత్రవల్కార్ నాలుగు బంతులకు పరుగులివ్వగా.. ఐదో బంతిని ఇషాన్ కిషన్(20) సిక్సర్‌గా మలిచాడు.
Innings Break!
Captain Surya Kumar Yadav’s terrific 8⃣4⃣*(49) propel #TeamIndia to 1⃣6⃣1⃣ 👌👌
Over to our bowlers 🙌
Scorecard ▶️ https://t.co/Rlm2ARPnOV#MenInBlue | #T20WorldCup | #INDvUSA pic.twitter.com/6cI4ctXIVk
— BCCI (@BCCI) February 7, 2026
ఆ తర్వాత ఓవర్లో అభిషేక్ శర్మ(0) పరుగుల సునామీ పక్కా అనుకున్న ప్రేక్షకులకు షాకిచ్చాడు అలీ ఖాన్. కవర్స్‌లో ఫీల్డర్‌ను మోహరించి అభిషేక్‌ను గోల్డెన్ డకౌట్ చేశాడతను. ఆ తర్వాత ఇషాన్, తిలక్ వర్మ(25)లు పెద్ద షాట్లతో దూకుడుగా ఆడినా.. వాన్ స్కాల్క్విక్(4-25) ఊహించని దెబ్బకొట్టాడు. పవర్ ప్లే చివరి ఓవర్ రెండో బంతికే ఇషాన్‌ను బోల్తా కొట్టించిన అతడు.. ఆ తర్వాత తిలక్ వర్మను ఊరించే బంతితో పెవిలియన్ చేర్చాడు. సిక్సర్ల శివం దూబే (0) సైతం బంతిని ఆడాలా? వద్దా అనుకుంటూ ఆడి నేత్రవల్కర్ చేతికి చిక్కాడు. చూస్తుండగానే నాలుగు వికెట్లు పడడంతో స్టేడియమంతా నిశబ్దంగా మారింది.
Leading from the front! 🫡
Captain @surya_14kumar with a crucial 𝗳𝗶𝗳𝘁𝘆 👏
His 2⃣5⃣th in T20Is 👌
Updates ▶️ https://t.co/Rlm2ARPnOV#TeamIndia | #MenInBlue | #T20WorldCup | #INDvUSA pic.twitter.com/NIBrp5EBnc
— BCCI (@BCCI) February 7, 2026
ఫామ్‌లో ఉన్న రింకూ సింగ్(6), హార్దిక్ పాండ్యా(5)లు సైతం తేలిపోగా.. అక్షర్ పటేల్(14) అండతో సూర్య సమయోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 15వ ఓవర్ తర్వాత రెచ్చిపోయిన కెప్టెన్ తనమార్క్ షాట్లతో అలరించాడు.16వ ఓవర్లో మూడు ఫోర్లు, సిక్సర్‌తో 21 రన్స్ పిండుకున్న మిస్టర్ 360 .. ఆఫ్‌సైడ్ సంధించిన బంతులను లెగ్‌సైడ్ బౌండరీ తరలించి యూఎస్ఏ బౌలర్లను ఆశ్చర్యపరిచాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో వరుసగా 4, 6, 6, 4 బాది ప్రత్యర్థికి 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలకమయ్యాడు టీమిండియా సారథి.