Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం నష్టాలో మొదలవగా.. చివరి వరకు ఏ దశలోనూ కోలుకోలేదు. దీంతో మూడు రోజుల లాభాలకు బ్రేక్ పడినట్లయ్యింది. ఉదయం సెన్సెక్స్ 71,437.35 పాయింట్ల వద్ద మొదలవగా.. ఇంట్రాడేలో 71,142.29 కనిష్ఠానికి చేరింది. చివరకు 168.66 పాయింట్లు పతనమై 71,315.09 వద్ద ముగిసింది. మరో వైపు నిఫ్టి 38 పాయింట్లు తగ్గి 21,418.65 వద్ద స్థిరపడింది.
దాదాపు 1,886 షేర్లు పురోగమించగా.. 1478 షేర్లు క్షీణించాయి. 124 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, టెక్ మహీంద్రా టాప్ లూజర్స్‌గా నిలువగా.. బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, హిందాల్కో ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభపడ్డాయి. సెక్టార్లలో ఫార్మా ఇండెక్స్ ఒక శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.7శాతం, రియల్టీ ఇండెక్స్ ఒక శాతం, బ్యాంక్ ఇండెక్స్ 0.5 శాతం పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం లాభపడ్డాయి.