56 వేల పాయింట్ల దిగువకు సెన్సెక్స్
709 పాయింట్లు నష్టపోయిన సూచీ
ముంబై, మార్చి 15: స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. వడ్డీరేట్ల పెంపుపై ఫెడరల్ రిజర్వు సమావేశమవుతుండటం, రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల మధ్య సూచీలు భారీగా నష్టపోయాయి. వీటికి తోడు రూపాయి పతనం, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం మార్కెట్లో సెంటిమెంట్‌ను నిరాశాపరిచింది. ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకుపైగా నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 709.17 పాయింట్లు నష్టపోయి 55,77 6.85 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 208.30 పాయిం ట్లు తగ్గి 16,663 వద్దకు జారుకున్నది.
మెరిసిన ఆటోమొబైల్ షేర్లు
ఆటోమొబైల్ సంస్థలను ఆదుకునే ఉద్దేశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్టాక్ మార్కెట్ల భారీ పతనాన్ని అడ్డుకోగలిగాయి. ఈ రంగ షేర్లు మూడు శాతం వరకు లాభపడ్డాయి. మారుతితోపాటు హీరో తదితర 75 సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో మారుతి, మహీంద్రా, బజాజ్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
2.61 లక్షల కోట్లు ఆవిరి
మంగళవారం మదుపరులు రూ.2.61 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.2,61,145.72 కోట్లు తగ్గి రూ.2,51,66,630.06 కోట్లకు పరిమితమైందని ఎక్సేంజి వర్గాలు తెలిపాయి.