Stock Market | లాభాల స్వీకరణకు అవకాశం
గత వారం స్టాక్ మార్కెట్లు రికార్డులతో అదరగొట్టినా.. పడుతూ లేస్తూనే సాగాయి. కొత్త గరిష్ఠాల వద్ద మదుపరులు ఆచితూచి వ్యవహరించారు. ఫలితంగా ఈ వారం కూడా లాభాల స్వీకరణకు వీలుందన్న అభిప్రాయాలు మార్కెట్ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.
Stock Market | గత వారం స్టాక్ మార్కెట్లు రికార్డులతో అదరగొట్టినా.. పడుతూ లేస్తూనే సాగాయి. కొత్త గరిష్ఠాల వద్ద మదుపరులు ఆచితూచి వ్యవహరించారు. ఫలితంగా ఈ వారం కూడా లాభాల స్వీకరణకు వీలుందన్న అభిప్రాయాలు మార్కెట్ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ సూచీల్లో అమ్మకాల ఒత్తిడి నెలకొనవచ్చని అంటున్నారు. గత వారం ట్రేడింగ్ చివరి రోజున అమెరికా ద్రవ్యోల్బణం పెరుగుదలతో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల కోత ఆలస్యమవుతుందన్న అంచనాలు వ్యాపించాయి. అందువల్లే సూచీలు భారీ నష్టాలనూ చవిచూశాయి. అయితే ఈ ప్రభావం ఈ వారం ట్రేడింగ్‌పైనా కనిపించవచ్చు.
ఇక క్రిందటి వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ కేవలం 5.7 పాయింట్లే పెరిగింది. 22,519.40 పాయింట్ల వద్ద నిలిచింది. దీన్నిబట్టి ఇన్వెస్టర్లు పెట్టుబడులపట్ల ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారో తెలుసుకోవచ్చు. కాగా, గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, వివిధ అంతర్జాతీయ పరిణామాలు కూడా ఈ వారం మార్కెట్ తీరును నిర్దేశించనున్నాయి. ఇక నిఫ్టీకి 22,400 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 22,000 మద్దతు స్థాయిగా చెప్పుకోవచ్చని మెజారిటీ నిపుణుల మాట. అయితే మార్కెట్ రికార్డు పరుగులు కొనసాగితే ఈ వారం 22,800-23,000 మధ్యకు నిఫ్టీ వెళ్లవచ్చని కూడా అంటున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

