Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాల నేపథ్యంలో బెంచ్మార్క్ సూచీలు నష్టపోయాయి. సెన్సెక్స్ 694.96 పాయింట్లు క్షీణించి 61,054.29 వద్ద, నిఫ్టీ 186.80 పాయింట్లు పతనమై 18,069 పాయింట్ల వద్ద ముగిశాయి. దాదాపు 1,499 షేర్లు పురోగమించగా, 2,015 పతనమయ్యాయి. మరో 127 షేర్లలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. ఇవాళ ఉదయం నుంచి ట్రేడింగ్ నష్టాలతోనే మొదలయ్యాయి.
ప్రారంభంలోనే సెన్సెక్స్ 586.15 పాయింట్లు పడిపోయి 61,163.10 పాయింట్ల స్థాయికి చేరింది. నిఫ్టీ 150.9 పాయింట్లు క్షీణించి.. 18,104.90 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత ఏ దశలోనూ సూచీలు కోలుకోలేదు. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందాల్కో, యూపీఎల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు అధికంగా నష్టపోయగా.. టైటాన్ కంపెనీ, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ, నెస్లే, హీరో మోటోకార్ప్ తదితర షేర్ల లాభపడ్డాయి.