Stock Market | దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్లలోని ప్రతికూల పవనాలు మధ్య సూచీలు పతనమయ్యాయి. ఉదయం 91 పాయింట్లు తగ్గి.. 66,592 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. చివరకు సెన్సెక్స్ 299.48 పాయింట్లు పతనమై 66,384.78 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 72.70 పాయింట్లు క్షీణించి 19,672.30 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 1,731 షేర్లు పురోగమించగా, 1873 షేర్లు క్షీణించాయి. 147 షేర్లు మాత్రం మారలేదు.
నిఫ్టీలో ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్ టాప్ లూజర్స్‌గా నిలువగా.. ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, బజాజ్ ఫిన్సర్వ్, ఎంఅండ్ఎం లాభపడ్డాయి. సెక్టోరల్‌లో, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ దాదాపు 2శాతం క్షీణించగా, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంక్ అండ్ మెటల్ ఒక్కొక్కటి 0.5 శాతం పడిపోయాయి. మరోవైపు పవర్, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 0.5 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరగ్గా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది.