Teacher Posts | 10 వేల టీచర్ పోస్టులు గల్లంతు.. రేషనలైజేషన్‌కు కాంగ్రెస్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్
Teacher Posts | సర్కార్ బడులను మరింత నిర్వీర్యం చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ అడుగులేస్తున్నది. పేదలకు నాణ్యమైన ఉచిత విద్యను దూరం చేయబోతున్నది. దీంట్లో భాగంగా సర్కార్ బడుల రేషనలైజేషన్‌కు ప్రభుత్వం ఇటీవలే పచ్చజెండా ఊపింది. కొంతకాలం క్రితం సీఎం రేవంత్ సమక్షంలో జరిగిన సమావేశంలో రేషనలైజేషన్‌కు సర్కార్ అనుమతి ఇచ్చింది.
Teacher Posts | హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : సర్కార్ బడులను మరింత నిర్వీర్యం చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ అడుగులేస్తున్నది. పేదలకు నాణ్యమైన ఉచిత విద్యను దూరం చేయబోతున్నది. దీంట్లో భాగంగా సర్కార్ బడుల రేషనలైజేషన్‌కు ప్రభుత్వం ఇటీవలే పచ్చజెండా ఊపింది. కొంతకాలం క్రితం సీఎం రేవంత్ సమక్షంలో జరిగిన సమావేశంలో రేషనలైజేషన్‌కు సర్కార్ అనుమతి ఇచ్చింది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలో హేతుబద్ధీకరణను చేపట్టనున్నారు. ఈ రేషనలైజేషన్‌తో పదివేల టీచర్‌పోస్టులు గల్లంతుకానున్నాయి. అంటే ఈ పోస్టులున్నా లేనట్టే లెక్క. వీటిని భర్తీచేయరు. రాష్ట్రంలో చివరగా 2015లో రేషనలైజేషన్ చేపట్టారు. ఆ తర్వాత మళ్లీ పదేండ్ల తర్వాత రేషనలైజేషన్ చేపట్టేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది.
దీనిని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రంలో 24,235 సర్కార్ బడులుంటే వీటిల్లో ఎన్రోల్మెంట్ 16,57,812 మాత్రమే. ఇదే బడుల్లో 1.06 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. అంటే ఉపాధ్యాయ- విద్యార్థి నిష్పత్తి 16లోపే ఉంది. కానీ నిబంధనల ప్రకారం 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. రాష్ట్రంలో మంజూరైన టీచర్ పోస్టులు 1,25,583 ఉండగా, 18వేలకుపైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే సర్కార్ బడుల్లో ఎన్రోల్మెంట్ తగ్గుతుండటంతోనే ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి పడిపోతున్నది. ఎన్రోల్మెంట్ పెంచకుండా సర్కార్ రేషనలైజేషన్ చేపట్టనున్నది. ఈ ప్రక్రియతో 10వేలకు పైగా టీచర్ పోస్టులు గల్లంతుకానున్నాయి. ఈ పదేండ్ల కాలంలో మిగులు టీచర్ల సర్దుబాటును మాత్రమే చేపట్టారు. రేషనలైజేషన్ జోలికి వెళ్లలేదు. కానీ కాంగ్రెస్ సర్కార్ రేషనలైజేషన్‌కు అనుమతి ఇచ్చింది. అంటే మెగా డీఎస్సీ, కొత్త టీచర్ రిక్రూట్మెంట్ చేపట్టే అవకాశాలు లేనట్టే.
ఇదీ పరిస్థితి..
- రాష్ట్రంలో 50లోపు విద్యార్థులున్న బడులు రాష్ట్రంలో 9,994 ఉన్నాయి. ఈ బడుల్లో 76,105 మంది టీచర్లున్నారు. మొత్తంగా 1.06లక్షల మంది టీచర్లలో ఈ పదివేల బడుల్లోనే 76 వేల మంది పనిచేస్తున్నారన్నమాట.
- 10 మంది లోపు విద్యార్థులున్న బడులు 4,438 ఉన్నాయి. వీటిల్లో 3,802 మంది టీచర్లు పని చేస్తున్నారు. 11 నుంచి 20 మంది విద్యార్థులున్న బడుల సంఖ్య 4,075 ఉన్నాయి. వీటిల్లో 7,571 మంది టీచర్లు పనిచేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య 21 నుంచి 30లోపు ఉన్న బడులు 3,208 ఉన్నాయి. వీటిల్లో 7,418 మంది టీచర్లు పనిచేస్తున్నారు.
- 31 నుంచి 40లోపు విద్యార్థులు ఉన్న బడులు 2,628 ఉండగా, వీటిల్లో 7,518 మంది టీచర్లు పనిచేస్తున్నారు. జీరో ఎన్రోల్మెంట్ బడులు 2వేలు ఉండగా, ఈ స్కూళ్లను విద్యాశాఖ మూసివేయాలని ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నది.
పాత జీవోను మార్చాల్సిందే
రేషనలైజేషన్ చేపట్టేందుకు గతంలో జీవో జారీచేశారు. పదేండ్ల క్రితం అప్పటి పరిస్థితులను బట్టి జీవో జారీచేశారు. ఈ జీవోను ఈ సారి ప్రామాణికంగా తీసుకుంటే అస్సలు ఒప్పుకోం. పాత జీవోను మార్చితే, మళ్లీ కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తేనే రేషనలైజేషన్‌కు అంగీకరిస్తాం. పాత జీవోనే అమలుచేస్తామంటే మేం ఉద్యమ బాట పడతాం.
– సదానందంగౌడ్, ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
బడులు మూసివేస్తే ఊరుకోం
ఇప్పటికే 2వేలకు పైగా జీరో ఎన్రోల్మెంట్ బడులను మూసివేశారు. రేషనలైజేషన్ పేరుతో మిగతా సర్కార్ బడులను మూసివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బడులు మూసివేస్తే అస్సలు ఊరుకోం. ఎన్రోల్మెంట్ తగ్గేందుకు సర్కార్ విధానాలే కారణం. రాష్ట్ర బడ్జెట్లో నిధులు పెంచడంలేదు. మెరుగైన వసతుల్లేవు. దీంతోనే పిల్లల సంఖ్య తగ్గుతుంది. ప్రైవేట్లోనేమో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉంటాయి. సర్కార్ బడుల్లో ఇవి ఉండవు. విద్యార్థి ఒక బడిలో చేరిన తర్వాత మరో స్కూల్‌కు మారగలడా..? అంటే మారడంలేదు. కనుక మూడేండ్లు నిండిన వారిని సర్కార్ బడుల్లో చేర్చుకోవాలి.
– మట్టపల్లి రాధాకృష్ణ, టీపీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

